: చిన్నారి శ్రాగ్వి సేఫ్ ... పోలీసుల అదుపులో కిడ్నాపర్లు!
హైదరాబాద్ అంబర్ పేటలో నాలుగురోజుల కిందట అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్వి మిస్టరీ వీడింది. శ్రాగ్వి క్షేమంగానే ఉందని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ ఈరోజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు చిన్నారిని మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పారు. శ్రాగ్వి అపహరణకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నా రు. అయితే, కుటుంబ కలహాల కారణంగా బంధువులే శ్రాగ్విని మాయం చేశారని పోలీసులు చెబుతున్నారు.
కాగా, శ్రాగ్వి ఆచూకీ విషయాన్ని పోలీసులు ముందుగా కుటుంబానికి చెప్పకుండా మీడియాకు వెల్లడించడంపై తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ వార్తను తాము నమ్మలేమంటున్నారు. హైదరాబాద్ అంబర్ పేట శివంరోడ్డులో నాలుగు రోజుల కిందట రాత్రి సమయంలో 8 నెలల శ్రాగ్విని తల్లి ఎత్తుకొని వెళుతుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటారు వాహనంపై వచ్చి చిన్నారిని బలవంతంగా తీసుకుపోయారు. పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని శోధించారు.