: మీడియాను ఆకట్టుకోవాలనే... ధర్నాలు: వెంకయ్యనాయుడు


ఢిల్లీలో విద్యుత్ కోతలపై మీడియాను ఆకట్టుకునేందుకు బీజేపీ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, విద్యుత్ కోతలు పెరిగితే ఆయా విద్యుత్ కార్యాలయాల వద్ధ ధర్నా చేయాలని సూచించారు. ప్రతిపక్షాలు బీజేపీ వల్లే ధరలు పెరిగాయని నిందలు మోపుతున్నాయని మండిపడ్డ ఆయన, హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే అపప్రథ తమపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ భాషను ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా వాడాలని మార్చిలో యూపీఏ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అది కూడా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమేనని ఆయన వెల్లడించారు.

అదిప్పుడు అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. రైల్వే ఛార్జీల పెంపుదల మే నుంచి అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే ప్రతిపాదనలు తయారు చేసి పెండింగ్ లో పెట్టారని వెంకయ్య చెప్పారు. యూపీఏ సగంలో ఆపేసిన పనులను పూర్తి చేస్తుంటే ఇప్పుడు వారే రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News