: స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
అల్పపీడన ద్రోణి కోస్తాంధ్ర మీదుగా స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించినా అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వర్షాల కోసం రైతుల నిరీక్షణ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితి ఏర్పడితేనే రుతుపవనాల్లో కదలిక వస్తుందని వాతావరణ నిపుణులు అంచనావేస్తున్నారు.