: 'ఫ్లిప్ కార్ట్' కొలువుల జాతర


ఆన్ లైన్ కొనుగోళ్ళ పోర్టల్ 'ఫ్లిప్ కార్ట్' భారీ ఎత్తున నియామకాలు చేపట్టనుంది. ఈ ఏడాది 12,000 మంది ఉద్యోగులను సంస్థలోకి తీసుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. సేవలు, సాంకేతిక విభాగాల్లో వీరిని నియమిస్తారు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో 13 వేల మంది ఉన్నారని, ఆ సంఖ్యను పాతికవేలకు పెంచుకోవాలన్నది తమ ప్రణాళిక అని సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ (సీపీఓ) మెకిన్ మహేశ్వరి తెలిపారు. వ్యాపార అవసరాల రీత్యా ఈ నియామకాలు చేపడుతున్నామని మహేశ్వరి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News