: హైదరాబాదుపై భారీ పరిహారం కోరాలని ఏపీ సర్కారు యోచన!
హైదరాబాద్ ను కోల్పోయి తాము భారీగా నష్టపోయామని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ పై తాము లక్షల కోట్లు పెట్టుబడి రూపంలో ఖర్చు చేశామని, ఆ నిధులను కేంద్రం పరిహారంగా చెల్లించాల్సిందేనని సర్కారు అంటోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయాలని నిశ్చయించుకున్నారు. ఆయన ఈ నెల 25న ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో ఈ విషయమై చర్చిస్తారని తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఒక్క హైదరాబాదుపైనే రూ.13.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టామని, ఆ మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.