: నేడు ఇంగ్లండ్ కు టీమిండియా పయనం
ఇంగ్లండ్ లో సుదీర్ఘ పర్యటనకు భారత జట్టు నేడు పయనం కానుంది. జూలై 9న ఆరంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ కోసం 18 మంది సభ్యుల టీమిండియా ముంబయి నుంచి ఇంగ్లండ్ బయల్దేరుతోంది. ఈ సందర్భంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మీడియాతో మాట్లాడాడు. అందివచ్చిన తొలి అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడం ఇంగ్లండ్ గడ్డపై కీలకమని అభిప్రాయపడ్డాడు. 2011లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లతో పరాజయం పాలయ్యామని, ఈసారి పొరబాట్లను పునరావృతం చేయబోమని తెలిపాడు. ఇక, తన బ్యాటింగ్ గురించి చెబుతూ, ఇంగ్లండ్ లో పరిస్థితులు ఎలా ఉన్నా తన సహజశైలిలో దూకుడుగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు.