: పట్టాలు తప్పిన యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్


యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ ఈ తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తమిళనాడులోని రాయవేలూరు జిల్లా అరక్కోణం సమీపంలో సిట్టేరి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురయ్యాయని సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఏసీ బోగీల అద్దాలు పగులకొట్టి ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. గాయపడిన వారిని చికిత్సకోసం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

మరోవైపు అరక్కోణం మార్గంలో వెళ్లే 'చెన్నై-బెంగళూరు' బృందావన్ ఎక్స్ ప్రెస్, 'చెన్నై-కోయంబత్తూరు' దురంతో ఎక్స్ ప్రెస్, 'చెన్నై-కోయంబత్తూరు' ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపివేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నానికి రాకపోకలు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఆ ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకునే వారికోసం రైల్వే శాఖ-092449 19572 హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News