: ఎన్టీఆర్, ఏయన్నార్, రజనీకాంత్ లకు బట్టలు కుట్టిన చరిత్ర నాది: 'యాక్స్' వాలేశ్వరరావు
విజయవాడలోని 'యాక్స్ ఎన్ యాక్స్' వివాదం మళ్లీ రేగింది. బీసెంట్ రోడ్డు లోని యాక్స్ ఎన్ యాక్స్ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు భవన యజమాని కామేశ్వరి వెళ్లడంపై భవన లీజుదారు వాలేశ్వరరావు మండిపడుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, రజనీకాంత్ లకు బట్టలు కుట్టిన చరిత్ర తనదని చెప్పిన వాలేశ్వరరావు, భవనం లీజు అగ్రిమెంట్ 2017 వరకు తన పేరిట ఉందని తెలిపారు. గత రెండేళ్లుగా భవనానికి అద్దె చెల్లించడం లేదని యజమాని కామేశ్వరి ఆరోపించారు.