: భారత్ లో అణ్వస్త్రాల పెంపా?... ఒట్టి పుకార్లేనన్న అమెరికా
భారత్ అత్యంత రహస్యంగా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోందంటూ వస్తున్న వార్తలు ఒట్టి పుకార్లేనని అమెరికా కొట్టిపారేసింది. ఇవన్నీ ఊహాజనితమైన వార్తలేనని అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి జెన్ సాకి చెప్పారు. అణ్వస్త్ర నిరాయుధీకరణ ఒప్పందానికి తమతో పాటు భారత్ కూడా కట్టుబడి ఉందన్న ఆమె, అసలు తన మిలిటరీ బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ప్రస్తుతం భారత్ కు లేదని కూడా వ్యాఖ్యానించారు. మైసూర్ కు సమీపంలోని ఇండియన్ రేర్ మెటల్స్ ప్లాంట్ లో యురేనియం హెక్సాఫ్లోరైడ్ ప్లాంట్ ను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తాము కనుగొన్నట్లు ఐహెచ్ఎస్ జేన్ అనే సంస్థ వెల్లడించిన వార్తలపై విలేకరులు సంధించిన ప్రశ్నలకు ఆమె పై విధంగా స్పందించారు.