: వారికి సిగ్గు, మానం, మర్యాద లేవు: రఘువీరారెడ్డి
ఫిరాయింపులను ప్రోత్సహించేవారికి సిగ్గు, మానం, మర్యాద లేవని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీ ఎన్టీఆర్ తోనే చచ్చిపోయిందని అన్నారు. ఇప్పడు టీడీపీలో ఉన్న నేతలంతా వలస నేతలేనని, నకిలీలేనని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ నేతేనని ఆయన గుర్తు చేశారు. టీడీపీకి అహంకార ధోరణి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
పార్టీని ఎవరూ వీడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక వేళ పార్టీని వీడాలని నిర్ణయించుకుంటే పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆయని సూచించారు. తమ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకున్నా తమకు అభ్యంతరం లేదని ఆయన సవాలు విసిరారు. రైల్వే ఛార్జీలు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.