: కేసీఆర్ అభినవ దుర్యోధనుడు: పల్లె రఘునాథ్ రెడ్డి
కేసీఆర్ అభినవ దుర్యోధనుడిలా తయారయ్యాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, న్యాయబద్ధంగా ఉన్న పీపీఏలను అనుమతించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. న్యాయబద్ధంగా చేసే వాటికి కూడా, 'ఆంధ్రావాళ్లు ద్రోహులు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు' అంటూ కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర విభజనలో అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీ సహా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేరుస్తామని ఆయన తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామని ఆయన చెప్పారు. రైల్వే ఛార్జీల పెంపు అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని ఆయన అన్నారు.