: స్టూవర్ట్ బ్రాడ్ రికార్డు


ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో, టెస్టుల్లో రెండు హ్యాట్రిక్ లు నమోదు చేసిన తొలి ఇంగ్లీష్ బౌలర్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. 2011లో బ్రాడ్ భారత్ పై తన తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. నిన్న తొలి రోజు ఆటలో ఓవర్ ఐదో బంతికి సంగక్కర (79), ఆరో బంతికి దినేశ్ చాందిమల్ (45)ను అవుట్ చేసిన బ్రాడ్... తర్వాతి ఓవర్ తొలి బంతికే ఎరంగ (0)ను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. బ్రాడ్ కు తోడు లియామ్ ప్లంకెట్ (5/64) కూడా చెలరేగడంతో లంక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 257 పరుగులకే కుప్పకూలింది.

  • Loading...

More Telugu News