: ఏదో ఒక రోజు 'జాతీయ అవార్డు' కొడతా: మహేశ్ బాబు


వరుసగా రెండో ఏడాది కూడా హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ మ్యాన్' గా ఎంపికవడం పట్ల నటుడు మహేశ్ బాబు హర్షం వ్యక్తం చేశారు. తనకు అనుకూలంగా ఓటు వేసిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమాభిమానాలు తనను కట్టిపడేస్తాయని పేర్కొన్నారు. ఏదో ఒక రోజు జాతీయ అవార్డు సాధిస్తానని మహేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

తన తాజా చిత్రం 'ఆగడు' గురించి చెబుతూ, ఆ సినిమా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందన్న నమ్మకం ఉందని తెలిపాడు. ఆ సినిమా సెప్టెంబర్ లో వస్తుందని వెల్లడించిన ప్రిన్స్... ఫస్ట్ లుక్ సంతృప్తి కలిగించిందని చెప్పుకొచ్చాడు. ఇక, స్క్రిప్టు డిమాండ్ చేసినప్పుడే షర్ట్ లెస్ గా కనిపించాలని అన్నాడీ బక్క పలుచని హీరో.

  • Loading...

More Telugu News