: ఇది మరో సహజీవనం కేసు!


కాలగమనంలో భారతీయ సంస్కృతి మసకబారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. పాశ్చాత్యశైలి 'సహజీవనం' ఛాయలు మనదేశంలోనూ కనిపిస్తున్నాయి. నిన్న హైదరాబాదులో ఓ టీవీ యాంకర్... తన ప్రియుడు ఇన్నాళ్ళు సహజీవనం చేసి ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధపడ్డాడని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, అలాంటి ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇది కూడా హైదరాబాదులోనే జరిగింది.

ఇంద్రనగర్ లో నివసించే ఓ యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. ఆమెకు మహబూబ్ నగర్ జిల్లా వనపర్తికి చెందిన నవీన్ తో పరిచయమైంది. పెళ్ళి చేసుకుంటానని ఆమెను నమ్మించిన నవీన్ రెండేళ్ళుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, ఆమెకు గర్భం రావడంతో అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేయసాగాడు. దీనికి నిరాకరించిన యువతి పెళ్ళి చేసుకోవాలని కోరింది. దీంతో, నయవంచకుడు ముఖం చాటేశాడు.

జరిగిన మోసం గ్రహించిన ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నవీన్ కు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయని, ప్రస్తుతం రెండో భార్యతో కాపురం వెలగబెడుతున్నాడని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News