: విభజన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది: నరసింహన్
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తూ, విభజన జరిగిన తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని అంగీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా లేదని తెలిపారు. పోలవరం బాధితులను కేంద్రమే ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందని చల్లని కబురు చెప్పారు. తుంగభద్ర బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.