: హైదరాబాద్ వాతావరణం స్ట్రాబెర్రీ పంటకు అనుకూలం: మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాతావరణం స్ట్రాబెర్రీ పంటకు అనువుగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. జపాన్ లోని నిషియో నగరానికి చెందిన ప్రతినిధుల బృందం ఆయనను హైదరాబాదులో కలిసిన సందర్భంగా మాట్లాడుతూ, జపాన్ లో విరివిగా సాగుచేసే స్ట్రాబెర్రీ పంటకు అనువైన వాతావరణం హైదరాబాదులో ఉందని, పంట సాగుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జపాన్ నిపుణులు తెలిపారని అన్నారు. స్ట్రాబెర్రీ పంటను సాగు చేసేందుకు ఆసక్తి గలిగిన తెలంగాణ యువతను జపాన్ తీసుకెళ్లి పంట సాగు పరిశీలించే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు.