: పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ధరలు ఎలా పెంచుతారు?: వైఎస్సార్సీపీ
రైల్వే ఛార్జీల పెంపును వైఎస్సార్సీపీ ఖండించింది. హైదరాబాదులో ఆ పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ఎలాంటి చర్చ లేకుండా ఏకపక్షంగా రైల్వే ఛార్జీలను ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఛార్జీలు పెంచి సాధారణ ప్రజలను చావబాదిన ఎన్డీయే ప్రభుత్వం, రవాణా ఛార్జీలను పెంచి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల నడ్డి విరిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంచిన ఛార్జీలను తక్షణం ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.