: అనవసరంగా 'రెచ్చగొట్టొద్దు': వైగో


దేశ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టద్దని ఎండీఎంకే నేత వైగో కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, 'నిద్ర పోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు' అని హెచ్చరించారు. సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాట బీజేపీ మిత్రపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందీని బలవంతంగా దేశ ప్రజలపై రుద్దాలన్న నిర్ణయాన్ని తమిళనాడు ఎన్నటికీ ఆమోదించదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఇలాంటి జీవో విడుదల చేస్తే అప్పుడు కూడా రక్తమోడ్చి హిందీపై పోరాడామని ఆయన గుర్తు చేశారు.

ఇప్పుడు మరోసారి రెచ్చగొట్టాలని చూస్తే అలాంటి పరిస్థితులనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పీఎంకే నాయకుడు ఎస్.రాందాస్ మాట్లాడుతూ, హిందీ అధికారభాష కాబట్టే అందరిపై రుద్దుతున్నారని, అలా కాకుండా దేశంలోని మొత్తం 22 భాషలనూ అధికార భాషలుగా కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎవరి భాషపై వారికి మమకారం ఉంటుందని, అలా కాదని హిందీ తప్పనిసరి అంటే పరిస్థితులు చేజారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News