: సుష్మాస్వరాజ్ కు కిషన్ రెడ్డి లేఖ
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇరాక్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు కృషి చేయాలని లేఖలో కోరారు. అక్కడ చిక్కుకున్న తెలుగువారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భయాందోళనలతో ఉన్నారని తెలిపారు. వీరిని వెంటనే స్వదేశానికి తీసుకు రావడానికి అవసరమైన చర్యలను తక్షణమే చేపట్టాలని కోరారు.