: ఔరా... ఆ నలుగురు!


పవన్ కుమార్, చాణుక్య, నిఖిల్, దివాకర్... నలుగురూ స్నేహితులు. ఈ తెలుగుతేజాలు నలుగురూ తాజాగా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ.. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా..! అక్కడికే వస్తున్నాం. నిన్న విడుదలైన జేఈఈ ఫలితాల్లో ఈ మిత్ర బృందం టాప్-20లో చోటు సంపాదించింది. పవన్ కుమార్ 9వ ర్యాంకు, దివాకర్ రెడ్డి 12, నిఖిల్ కుమార్ 15, చాణుక్యవర్థన్ రెడ్డి 18వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. అన్నింటికన్నా అచ్చెరువొందించే విశేషం ఏమిటంటే... ఎంసెట్ లో తొలి నాలుగు ర్యాంకులు ఈ నలుగురు మిత్రులకే లభించాయి.

ఇంటర్ మొదటి సంవత్సరంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా బలపడింది. కళాశాలలో మెరుగ్గా చదివే విద్యార్థులను ప్రత్యేకంగా ఓ తరగతిగా విభజించేవారు. అలా ఈ నలుగురు ఒకే తరగతిలోకి రావడంతో పాటు ఒకే హాస్టల్ రూంను పంచుకున్నారు. ఒకరికి ఒకరు తోడుగా, సందేహాలు తీర్చుకుంటూ నేడు ముంబయి ఐఐటీ దిశగా అడుగువేశారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు చేసి సొంతగా ఓ సాఫ్ట్ వేర్ సంస్థ స్థాపించాలన్నది వీరి ఆశయం. తద్వారా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించవచ్చన్నది ఈ మిత్రుల సదాశయం.

  • Loading...

More Telugu News