: తెలంగాణకు ప్రత్యేక ఎంసెట్ నిర్వహించండి: మెడికల్ కాలేజీ యాజమాన్యాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మెడికల్ కాలేజీ యాజమాన్యాల భేటీ ముగిసింది. ఇప్పుడున్న మెడికల్ సీట్లను ప్రస్తుతానికి పెంచలేమని... అలాగే గతంలో ఉన్న ఫీజు విధానాన్నే కొనసాగించాలని ఈ సందర్భంగా సీఎస్ సూచించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను యథాతథంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఎంబీబీఎస్ ఫీజులను కచ్చితంగా పెంచాల్సిందేనని యాజమాన్యాలు విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా, తెలంగాణ ప్రాంతానికి ఎంసెట్ ను ప్రత్యేకంగా నిర్వహించాలని కోరాయి.