: చిన్నోడు కాదు... చిచ్చరపిడుగు...
బీహార్ కు చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఐఐటీ-జేఈఈ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. బీహార్ లోని రోహ్ తాస్ జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన శివానంద్ నిన్న విడుదలైన ఫలితాల్లో 2587వ ర్యాంకు సాధించాడు. అత్యంత చిన్న వయసులో ఐఐటీ-జేఈఈ పరీక్షలో ర్యాంకు సాధించిన రెండవ వ్యక్తి శివానంద్.
గతేడాది బీహార్ భోజ్ పూర్ జిల్లాకు చెందిన సత్యం కుమార్ కేవలం 13 ఏళ్లకే ఐఐటీ-జేఈఈ పరీక్షల్లో ఉత్తీర్ణుడై రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. శివానంద్ ర్యాంకు సాధించడంతో అతని కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. కాగా, ఫిజిక్స్ లో పరిశోధన చేయాలని ఉందని శివానంద్ పేర్కొన్నాడు.