: ఆ చైనా గిన్నె ఖరీదు రూ. 51 కోట్లు..!


చైనా రాజరికపు కాలానికి చెందిన ఓ అరుదైన పాత్ర వేలంలో కోట్లు కొల్లగొట్టింది. క్రీ.శ 1662-1722 కాలానికి చెందిన కాంగ్జి చక్రవర్తి ఏలుబడిలో ఈ ఎర్ర కలువ పాత్ర తయారైందట. తాజాగా హాంకాంగ్ లో జరిగిన వేలంలో ఈ పాత్ర రూ. 51 కోట్లు పలికింది. కాగా, ఓ చైనా పురాతన వస్తువుకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఇదో ప్రపంచ రికార్డు అని వేలం నిర్వాహకులు అంటున్నారు. హాంకాంగ్ కు చెందిన సిరామిక్ వ్యాపారి ఒకరు ఈ పాత్రను వేలంలో దక్కించుకున్నారు.

  • Loading...

More Telugu News