: సొంతూరులో కారు కూడా దిగలేకపోయిన శృంగారతార
సినీ నటిగా అంతులేని స్టార్ డం సంపాదించుకున్న సెక్సిణి మల్లికా షరావత్ తొలిసారి తన సొంతూరుకు వెళ్లింది. హీరోయిన్ అయిన తర్వాత హర్యానాలోని సొంతూరుకు వచ్చిన ఈ 37 ఏళ్ల భామకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కారును చుట్టుముట్టారు. కొంత మంది కారు వెనకాలే పరిగెత్తారు. అభిమానులను కంట్రోల్ చేయడం అక్కడున్న పోలీసులకు కూడా కష్టమయింది. ఈ పరిస్థితుల్లో ఆమె కారులోనే ఉండిపోయారు. ఈ ఘటనను మల్లిక ట్విట్టర్లో పంచుకుంది. "హర్యానాలోని నా సొంతూరుకు మొదటిసారి వచ్చా. కారు నుంచి బయటకు కూడా రాలేకపోయా" అని ట్వీట్ చేసింది.