: కుమారుడి రాసలీలలు... పట్టించిన తండ్రి
బెంగళూరులో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. డబ్బు ఎంతకైనా దిగజారుస్తుందని ఈ సంఘటన నిరూపించింది. బెంగళూరులోని తిలక్ నగర్ లో ఓ వైద్యుడు నివాసం ఉంటున్నాడు. అతని ఇంటికి టాటా స్కై డిష్ యాంటెన్నాలు అమర్చేందుకు ఆవులహళ్లి వాసి సుహాన్ (20) వెళ్లాడు. సిగిరెట్లు మానేసేందుకు సలహా చెప్పాలని కోరాడు. 'సరే, అందుకు ముందులిస్తా'నని సుహాన్ ను నగ్నంగా మార్చి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు.
విషయం ఎవరికీ చెప్పవద్దంటూ వేల రూపాయలు ఇచ్చి పంపేశాడు. జరిగిన విషయం తన మిత్రులు మధు, వికాస్, దివాకర్ లకు సుహాన్ చెప్పాడు. మరోసారి సుహాన్, వికాస్ లు ఆ వైద్యుడితో స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారు. దానిని వైద్యుడికి తెలీకుండా మొబైల్ లో చిత్రీకరించారు. తరువాత ఆ క్లిప్పింగులు వైద్యుడికి చూపించి 5 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో వీడియోలు బయటపెడతామని బెదిరించారు. దీంతో అతను వారికి 5 లక్షల రూపాయలు ముట్టచెప్పాడు.
వీరిద్దరూ గత నెలలో తమ స్నేహితులైన నితీష్, మహేష్, విశ్వలను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లి సీసీబీ పోలీసులు, మీడియా ప్రతినిధులని చెప్పి 11 లక్షలు వసూలు చేశారు. దమ్మిడీ సంపాదన లేని తన కుమారుడు కొంత కాలంగా విలాసవంతంగా తిరుగుతుండడంతో అనుమానం వచ్చిన ఓ యువకుడి తండ్రి తనకు తెలిసిన సీసీబీ కానిస్టేబుల్ కు విషయం వివరించాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై నిఘా వేశారు. అసలు విషయం బయటపడడంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు.
వారి నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు ఎంబీఏ విద్యార్థులు కాగా, ఇద్దరు బీకాం చదువుతున్నారు. వీరిపై బెదిరింపులు, చీటింగ్ వంటి కేసులు నమోదు చేశారు. వైద్యుడిపై కేసు నమోదు చేసేందుకు న్యాయనిపుణులను పోలీసులు సంప్రదిస్తున్నారు.