ఆదిలాబాద్ జిల్లాలో వెలసిన బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఈ రోజు భక్తులు పోటెత్తారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.