: ఆంధ్రప్రదేశ్ ను 25 జిల్లాలు చేయాలి: బీజేపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, 25 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాపు తయారు చేస్తున్నామన్నారు. రాజధాని ఎక్కడున్నా అభివృద్ధి రాష్ట్రం మొత్తం జరగాలని ఆయన సూచించారు. భద్రాచలంలోని నాలుగు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేస్తే పోలవరానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నాయకులు దూరదృష్టితో వ్యవహరించి కరెంటు, నీరు, సరిహద్దుల విషయంలో లబ్దిపొందారని ఆయన తెలిపారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు మానాలని ఆయన సూచించారు.