: కుమ్మేసిన కోహ్లీ.. సన్ రైజర్స్ కు తొలి ఓటమి
ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి ఓటమి చవిచూసింది. ఈరోజు సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి మైదానంలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో చిత్తయింది.లక్ష్య ఛేదనలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (93 నాటౌట్) వీరోచిత ప్రదర్శన కనబర్చడంతో చాలెంజర్స్ మరో 14 బంతులు మిగిలుండగానే జయభేరి మోగించింది.
ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేయగా.. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కోహ్లీ విధ్వంసక ఇన్నింగ్స్ తో చాలెంజర్స్ 3 వికెట్లు నష్టపోయి 17.4 ఓవర్లలో 162 పరుగులు చేసింది. దీంతో మొన్న హైదరాబాద్ లో సన్ రైజర్స్ చేతిలో ఎదురైన పరాజయానికి చాలెంజర్స్ నేడు ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.