: ఫ్యాప్సీ భవన్ లో యాడ్ ఫిల్మ్ మేకింగ్ పై వర్క్ షాప్
సృజనాత్మకమైన ఆలోచనలతో ఉన్న యువతరానికి యాడ్ ఫిల్మ్ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాప్సీ అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. యాడ్ వెంచురా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఫ్యాప్సీ భవన్ లో ఆరు రోజుల పాటు జరిగే యాడ్ ఫిల్మ్ మేకింగ్ పై వర్క్ షాపును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పైప్స్ అధినేత జయదేవ్, యాడ్ ఫిల్మ్ రంగ నిపుణులు కుమార్, బ్రాండింగ్ మేనేజర్ రిచా తదితరులు పాల్గొన్నారు.