: సోనియా, రాహుల్ శకం ముగిసింది... ప్రియాంక వచ్చినా ఉపయోగం లేదు: జేసీ
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ శకం ముగిసిందని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని అసెంబ్లీ లాబీల్లో ఆయన మాట్లాడుతూ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినా ఉపయోగం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అవసరం తనకు, తన అవసరం చంద్రబాబునాయుడుకి ఉందని ఆయన తెలిపారు. అందుకే తామిద్దరం ఎన్నికల ముందు కలిశామని జేసీ వెల్లడించారు.