: ముగిసిన కమల్ నాథన్ కమిటీ భేటీ
హైదరాబాదులోని సచివాలయంలో ఇవాళ ఉదయం సమావేశమైన కమల్ నాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై చర్చించింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్ లు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమల్ నాథన్ కమిటీ ఈ నెల 27వ తేదీన మరోమారు సమావేశమవ్వాలని నిర్ణయించింది.