: జెన్నీఫర్ లోపెజ్ ప్రస్తుతానికి ఒంటరి


ప్రముఖ హాలీవుడ్ నటి, పాప్ గాయని జెన్నీఫర్ లోపెజ్, నటుడు, సింగర్ మార్క్ ఆంటోనీకి విడాకులు ముంజూరయ్యాయి. పదేళ్ల వీరి వివాహబంధం కోర్టు విడాకులు మంజూరు చేయడంతో ముగిసింది. జెన్నిఫర్ లోపెజ్- మార్క్ ఆంటోనీ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాక్స్, ఎమ్మా అనే కవలలకు 2008లో జన్మినిచ్చారు. వీరిద్దరూ జెన్నీఫర్ లోపెజ్ సంరక్షణలో ఉంటారు. కాగా నెలలో వారం రోజులు మార్క్ ఆంటోనీకి పిల్లలతో గడపే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

కాగా, జెన్నీఫర్ లోపెజ్ కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు కాగా, మార్క్ ఆంటోనీకి ఒక పెళ్లి అయింది. జెన్నీఫర్ లోపెజ్, మార్క్ ఆంటోనీ దరఖాస్తు చేసుకున్న మూడున్నరేళ్ల తరువాత కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. వీరిద్దరూ విడిపోయిన తరువాతే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News