: జగన్ తో కరచాలనం చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నేడు అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ తో కరచాలనం చేశారు. ఇప్పటి వరకు వీరిద్దరూ ముఖాముఖి ఎదురుపడింది లేదనే చెప్పుకోవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారోత్సవానికి బాబు స్వయంగా జగన్ కు ఫోన్ చేసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అది మినహా వీరు మాట్లాడుకున్న సందర్భాలు లేవు! కాగా, నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. ఇకపై బాబు, జగన్ సంవాదాలు ప్రతి రోజూ చూడొచ్చేమో!