: హైటెక్స్ లో ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్ పో ప్రారంభం
హైదరాబాదులోని హైటెక్స్ ప్రాంగణంలో ‘ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్ పో 2014’ ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ఇవాళ ఉదయం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సాఫ్ట్ వేర్ రంగంలో హైదరాబాద్ దేశంలోనే ద్వితీయ స్థానంలో ఉందని అన్నారు. హైదరాబాదును హార్డ్ వేర్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.