: టాస్ గెలిచిన భారత్... తివారీ, అక్షర్ పటేల్ కు చోటు


బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు నెగ్గి మూడు మ్యాచ్ ల సిరీస్ ను చేజిక్కించుకున్న టీమిండియా... ఈ పోరులో రిజర్వ్ బెంచ్ ను పరీక్షించాలని నిశ్చయించుకుంది. ఈ క్రమంలో బెంగాల్ బ్యాట్స్ మన్ మనోజ్ తివారీ, కుర్ర స్పిన్నర్ అక్షర్ పటేల్ లకు చోటు కల్పించింది. ఈ డే/నైట్ మ్యాచ్ మరికాసేపట్లో ఆరంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్ లోనూ ఊతప్ప, రహానే జోడీ ఓపెనింగ్ చేయనుంది. ఇక, ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. సొహాగ్ ఘాజీ స్థానంలో జియావుర్ రెహ్మాన్ జట్టులోకొచ్చాడు.

  • Loading...

More Telugu News