: టీవీ9 రవిప్రకాశ్ పై కేసు నమోదు చేయండి... పోలీసులకు కోర్టు ఆదేశం
టీవీ9 చానల్ యజమాని రవిప్రకాశ్ పై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ కోర్టు ఎల్బీ నగర్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేశారని టీవీ9 యాజమాన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుంకరి జనార్థన్ గౌడ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు... ఐపీసీ 504, 506 సెక్షన్లతోపాటు 4ఏ, 6, కేబుల్ నెట్ వర్క్ చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.