: తారస్థాయికి చేరిన ఇరాక్ అంతర్యుద్ధం
ఇరాక్ లో అంతర్యుద్ధం తారస్థాయికి చేరింది. నిన్న ఇరాక్ లో అత్యంత భారీదైన భైజీ చమురుశుద్ధి కర్మాగారాన్ని స్వాధీనం చేసుకున్న నిషిద్ధ ఐఎస్ఐఎల్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంత్) తీవ్రవాదులు... నేడు మరికొన్ని కీలక పట్టణాలపైనా పట్టుబిగించారు. దేశంలో పలుచోట్ల తీవ్రవాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య తీవ్రపోరు కొనసాగుతోంది. వీధులు తుపాకుల మోతతో హోరెత్తుతున్నాయి. ఇప్పటికే మొసుల్, తిక్రిత్, అల్ పహూజా పట్టణాలను చేజిక్కించున్న ఐఎస్ఐఎల్ తీవ్రవాదులు మరికొన్ని పట్టణాల దిశగా ముందుకు కదులుతున్నారు. కాగా, కల్లోలిత ఇరాక్ లో 600 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నట్టు సమాచారం.