: చరిత్ర చెప్పినట్టే జరిగింది... స్పెయిన్ ఇంటికి చేరింది
ఫిఫా వరల్డ్ కప్ లో చరిత్ర చెప్పినట్టే జరిగింది. డిఫెండింగ్ చాంప్ తొలి రౌండ్ దాటదన్న సెంటిమెంట్ ను నిజం చేస్తూ స్పెయిన్ ఇంటికి చేరింది. గతరాత్రి చిలీతో జరిగిన మ్యాచ్ లో 0-2తో ఓటమిపాలైన స్పెయిన్ నాకౌట్ ఆశలను వదులుకుంది. గ్రూప్-బి తొలి మ్యాచ్ లో నెదర్లాండ్స్ చేతిలో చిత్తుగా ఓడిన డిఫెండింగ్ చాంప్ స్పెయిన్... చిలీతో చావోరేవో అనుకున్న పోరులోనూ చేతులెత్తేసింది. దీంతో వరుసగా రెండు పరాజయాలతో నాకౌట్ దశ చేరలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. కాగా, స్పెయిన్ పై విజయంతో చిలీ నాకౌట్ చేరింది. ఇతర మ్యాచ్ లలో నెదర్లాండ్స్ 3-2తో ఆస్ట్రేలియాపై నెగ్గి రెండో రౌండ్ చేరడం విశేషం. ఇక, గ్రూప్-ఎలో క్రొయేషియా 4-0తో కామెరూన్ పై గెలిచింది.