: 115 మందికి పెద్ద భవనం...175 మందికి చిన్న భవనం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు


115 మంది శాసనసభ్యులు ఉన్న తెలంగాణ అసెంబ్లీకి పెద్ద భవనం కేటాయించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా అసెంబ్లీని సందర్శించేందుకు వచ్చిన వారు మాట్లాడుతూ, 175 మంది శాసనసభ్యులు ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చిన్న భవనాన్ని ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీలో సీట్లే నిండడం లేదన్న వైఎస్సార్సీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను ఎక్కడ కూర్చోబెడతారని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎదురెదురుగా కూర్చోవాల్సిన అవసరం ఉందని, అలా ఉంటే ఒకరి భావాలు ఒకరికి అర్థం అవుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఇక్కడ అలా లేదని, ఒక్కో సీట్లో నలుగురు ఎమ్మెల్యేలు కూర్చోవాల్సి వచ్చేలా ఉందని... ప్రజాప్రతినిధులు అలా ఎలా కూర్చోగలుగుతారని వారు ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News