: వియత్నాం వ్యాపారికి చుక్కలు చూపించాడు!


వియత్నాం వ్యాపారికి సరుకు పంపిస్తానని చెప్పి గుంటూరుకు చెందిన మిర్చి వ్యాపారి మధు చుక్కలు చూపించాడు. సదరు వియత్నాంకు చెందిన వ్యాపారి మిర్చి సరుకు కోసం ఆన్ లైన్ లో రూ.30 లక్షలు పంపించాడు. అయితే, ఆ నగదును తీసుకున్న మధు సరుకును మాత్రం పంపించలేదంటూ బాధిత వ్యాపారి గుంటూరు అరండల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో ఓసారి చైనాకు నాసిరకం సరుకు పంపినట్టు కూడా మధుపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News