: రిలయన్స్ తొలి మహిళా డైరెక్టర్ నీతా అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆ కంపెనీ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సమర్థవంతంగా నడిపి వ్యాపారవేత్తగా పేరుగాంచిన నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో తొలి మహిళా డైరెక్టర్ కావడం విశేషం. ముంబైలో ఈ ఉదయం జరిగిన రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ షేర్ హోల్డర్లు కంపెనీ డైరెక్టర్ గా నీతా అంబానీ నియామకానికి ఆమోదముద్ర వేశారు. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీగా పేరుగాంచిన రిలయన్స్ లో నీతా అంబానీ డైరెక్టర్ గా మరిన్ని సంస్కరణలు తెస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.