: సాకర్ మ్యాచ్ చూస్తుండగా బాంబు పేలుడు.. 21 మంది మృతి
నైజీరియాలో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దమతురు పట్టణంలోని ఓ సెంటర్ వద్ద ప్రజలు వరల్డ్ కప్ ఫుట్ బాల్ మ్యాచ్ ను భారీ స్క్రీన్లపై లైవ్ చూస్తుండగా, విస్ఫోటనం చోటు చేసుకుంది. మోటార్ రిక్షాలో బాంబును అమర్చి పేలుడుకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో 21 మంది మరణించగా, 27మంది గాయపడ్డారు. కాగా, ఈ దాడికి తామే బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ కూడా ఇంకా ప్రకటించలేదు.