: పీపీఏ రద్దుకు ఏపీ సర్కార్ నిర్ణయం... తెలంగాణలో అలజడి
ఏపీ జెన్ కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ జెన్ కో చీఫ్ ఇంజినీర్ (కమర్షియల్) నుంచి నిన్న ఉత్తర్వులు అందాయి. ఈ నిర్ణయంతో తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు, ఏపీ ప్రాజెక్టుల ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ కు పరిమితమవుతుంది. ఈ నిర్ణయం తెలంగాణలో అలజడి రేపుతోంది. ఈ నిర్ణయంతో తెలంగాణలో విద్యుత్ లోటు అధికమవుతుందనే వాదనలు ప్రారంభమయ్యాయి. వివిధ పార్టీల నేతలు ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.