: సూపర్ బైక్ షోరూం నెలకొల్పనున్న ధోనీ
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీది బహుముఖ ప్రయాణం! క్రికెట్ తోపాటు అనేక వ్యాపారాలు, వ్యాపకాలు ఈ జార్ఖండ్ డైనమైట్ సొంతం. ఇప్పటికే 'మహి రేసింగ్ టీమ్' పేరిట ఓ సూపర్ బైక్ టీమ్ ను మెయింటైన్ చేస్తున్న ధోనీ తాజాగా సొంతగడ్డ రాంచీలో ఓ సూపర్ బైక్ షోరూం నెలకొల్పాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం సంబంధిత శాఖ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
రాంచీలోని హైదాల్ ప్రాంతంలో ధోనీకి ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. దాంట్లోనే ఓ ఫ్లోర్లో ఈ సూపర్ బైక్ షోరూం ఏర్పాటు చేస్తాడట. ఈ దుకాణంలో అన్ని రకాల ప్రపంచ స్థాయి సూపర్ బైకులు విక్రయిస్తారని సమాచారం.