: అమ్మాయి అనుకుని లిఫ్టిస్తే.... సీను రివర్స్ అయింది!


మంచికి వెళ్తే చెడు ఎదురౌతుందని అంటారు. ఆయ్యో పాపం, ఆడమనిషి కదా అని లిఫ్ట్ ఇస్తే... నీలాపనిందలకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్ హైదరాబాదు, బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీలోని ఆఫీసుకి బైక్ పై వెళ్తున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కమాన్ వద్దకు రాగానే స్కార్ఫ్ ధరించిన ఓ యువతి లిఫ్ట్ అడిగింది. శ్రీనివాస్ ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు.

బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రాగానే ఆమె బైక్ ఆపమని చెప్పింది. శ్రీనివాస్ బైక్ ఆపగానే తాళం చెవులు తీసుకుని 'లైంగిక వాంఛ తీర్చుకుని డబ్బులివ్వకుండా మోసం చేశాడంటూ' వీరంగం వేసింది. దీంతో షాక్ తిన్న శ్రీనివాస్ బిక్కచచ్చిపోయాడు. ఏం చేయాలో తోచక... 'ఆమె చెబుతుందంతా అబద్ధం. బైక్ కు అడ్డొచ్చి లిఫ్ట్ అడగడంతో ఎక్కించుకున్నా. అంతే తప్ప ఆమెకు, నాకు ఏ సంబంధం లేద'ని లబోదిబోమన్నాడు.

దీంతో అతని అమాయకత్వాన్ని గమనించిన స్థానికులు యువతి ముఖానికి కట్టుకున్న స్కార్ఫ్ తొలగించారు. అంతే... అంతా షాక్ అయ్యారు. అంత సేపూ యువతి అని భావించిన వారంతా స్థాణువులైపోయారు. ఎందుకంటే, తను హిజ్రా! దీంతో పోలీసులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించేలోపే సదరు హిజ్రా జారుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా మంచికి వెళ్తే చెడు ఎదురౌతుందంటే ఇదే అనుకున్నారు.

  • Loading...

More Telugu News