: లంక స్పిన్నర్ల స్ఫూర్తిగా చెలరేగుతాం: అశ్విన్


టీమిండియా ముంగిట మరో భారీ సిరీస్! ప్రస్తుతం బంగ్లాదేశ్ తో సిరీస్ ముగిసిన పిమ్మట భారత జట్టు ఇంగ్లండ్ పయనం కానుంది. ధోనీ సేన ఆ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లండ్ పర్యటనపై ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు సొంతగడ్డపై ఆపసోపాలు పడుతోంది. లంక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడుతోంది. తాము కూడా లంక స్పిన్నర్లను స్ఫూర్తిగా తీసుకుని చెలరేగిపోతామని అశ్విన్ అంటున్నాడు. ఈనెల 26న లీసెస్టర్ తో జరిగే మూడు రోజుల మ్యాచ్ తో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన ఆరంభమవుతుంది.

'ఇంగ్లండ్-శ్రీలంక సిరీస్ ను చూస్తున్నా. లంక స్పిన్నర్లు రాణిస్తుండడం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చేదే. ఉపఖండం ఆవల పిచ్ పరిస్థితులను ఎలా సద్వినియోగపరచుకోవాలన్నది అవగతమైంది' అని అశ్విన్ పేర్కొన్నాడు. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశ్విన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News