: సాకర్ వరల్డ్ కప్ లో నేడు మూడు మ్యాచ్ లు
బ్రెజిల్ ఆతిథ్యమిస్తున్న సాకర్ వరల్డ్ కప్ లో నేడు మూడు మ్యాచ్ లు జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30కి జరిగే పోరులో బలమైన నెదర్లాండ్స్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. మరో మ్యాచ్ రాత్రి 12.30కి జరగనుండగా, ఆ పోరులో డిఫెండింగ్ చాంప్ స్పెయిన్... చిలీతో అమీతుమీకి సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో నెదర్లాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న స్పెయిన్ కు చిలీతో మ్యాచ్ అగ్నిపరీక్షే. ఈ పోరులో గెలిస్తేనే స్పెయిన్ నాకౌట్ దశ అవకాశాలు మెరుగవుతాయి. ఇక, తెల్లవారుజామున 3. 30కి కామెరూన్, క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లను సోనీ సిక్స్ చానల్ లైవ్ గా అందిస్తోంది.