: కిరణ్ కుమార్ రెడ్డే కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచాడు: సి.రామచంద్రయ్య


విజయవాడలో జరుగుతున్న ఏపీ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో పలు పార్టీ నేతలు పార్టీని మళ్లీ విజయపథంలో నడిపించుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు కష్టపడదామని చెబుతున్నారు. పార్టీ నేత సి.రామచంద్రయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ ను బతికించుకుందామని, కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కు నిలువునా వెన్నుపోటు పొడిచింది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డేనని తీవ్రంగా విమర్శించారు. ఎలాగైనా పార్టీకి పునర్ వైభవం తెచ్చుకుందామని చెప్పారు. ఇక మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లం కూడా పార్టీకి చేయాల్సినంత చేయలేకపోయామన్నారు. సూర్యచంద్రులున్నంతకాలం కాంగ్రెస్ ఉంటుందని, క్యాడర్ లో ధైర్యం నింపి పార్టీని విజయపథంలో నడిపించుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News