: మెదక్ జిల్లా అభివృద్ధిపై మంత్రి సమీక్ష


మెదక్ జిల్లా అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల తీరును మంత్రి సమీక్షించారు. ఈ సమావేశం సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది. అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని, జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలని హరీష్ రావు చెప్పారు.

  • Loading...

More Telugu News