: ఎల్లో మీడియా చాటున టీడీపీ నేతల క్షుద్ర రాజకీయాలు: ఎమ్మెల్యే చెవిరెడ్డి
రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిన్న(సోమవారం) ఎర్రచందనం స్మగర్లను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలవటంపై మీడియాలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. దానిపై ఈ రోజు ఆయన స్పందిస్తూ, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జైల్లో వైసీపీ కార్యకర్త విజయానందరెడ్డిని తాను కలవడంపై ఆ మీడియా పలు రకాలుగా వక్రీకరించిందని మండిపడ్డారు. అయితే, పార్టీ కార్యకర్తను తాను కలవడాన్ని వంద శాతం సమర్థించుకుంటున్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ఆపదలో వుంటే వారెక్కడున్నా కలిసేందుకు వెనుకాడనన్నారు.